బ్రేకింగ్ – కరోనా సెకెండ్ వేవ్ కొత్త లక్షణాలు ఇవే

బ్రేకింగ్ - కరోనా సెకెండ్ వేవ్ కొత్త లక్షణాలు ఇవే

0

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. ఎక్కడ చూసినా వేలాది కేసులు వస్తున్నాయి ఇక దేశంలో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి అంటే సెకండ్ వేవ్ పరిస్దితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు, ప్రజలు మాత్రం చాలా చోట్ల ఇంకా మాస్కులు ధరించడం లేదు, కరోనా సోకినా ఏమీ కాదులే అనే నిర్లక్ష్యం చాలా మందికి సోకేలా మారుతోంది.

 

ఇక ఎంత భారీగా ఫైన్లు వేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఇక ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో భయంకరంగా కేసులు బయటపడుతున్నాయి…సెకెండ్ వేవ్లో కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మందికి జ్వరం అలాగే కీళ్ల నొప్పులు వస్తున్నాయి.. తలనొప్పి నీరసం కంటి సమస్యలు అజీర్తి ఒళ్లు బాగా చల్లబడటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

 

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి లేకపోతే పెను ప్రమాదం అంటున్నారు వైద్యులు.

కనుగుడ్డు నుంచి సైతం వైరస్ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్లుగా చెబుతున్నారు. రెండు మూడు రోజులు అయినా వాంతులు విరోచనాలు తగ్గకపోయితే జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటే కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. పరీక్షలు చేయించుకోవాల్సిందే. పెద్దలకే కాదు 20 ఏళ్ల యువతకు కూడా కేసులు వస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here