50 లక్షలు ఇచ్చి మోసపోయిన ప్రముఖ హీరోయిన్

50 లక్షలు ఇచ్చి మోసపోయిన ప్రముఖ హీరోయిన్

0

హీరోయిన్ నిక్కీ గల్రానీ టాలీవుడ్ లో మంచి నటిగా పేరు గుర్తింపు సంపాదించుకుంది… ఈ అందాల భామ చేసినవి కొన్ని సినిమాలే అయినా తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది… సునీల్ సరసన కృష్ణాష్టమితో పాటు మరకతమణి మలుపు సినిమాల్లో నటించింది. అయితే ఆమె తాజాగా ఓ హోటల్ యజమానిని నమ్మి మోసపోయింది, ఇక దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది ఆమె.

 

 

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించాడు.. అతనికి నిక్కి గల్రాని పరిచయం ఉంది.. అయితే ఆమెని 50 లక్షలు పెట్టుబడిగా ఇవ్వాలి అని అడిగాడు నెలకి 1 లక్ష ఇస్తాను అని ప్రాఫిట్ అని చెప్పాడు, అయితే ఆమె అతనిని నమ్మి నగదు ఇచ్చింది.

 

 

నెలకు రూ. 1 లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాడు కాని వాస్తవంగా అతను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు… దీంతో తాను మోసపోయాను అని భావించి అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది, ఆ హోటల్ యజమానిని పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here