నిధి అగర్వాల్ రియల్ స్టోరీ

నిధి అగర్వాల్ రియల్ స్టోరీ

0

కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ అంటే నిధి అగర్వాల్ అనే చెప్పాలి, లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి, ఆమె రియల్ స్టోరీ చూద్దాం…17 ఆగస్టు 1993 న ఆమె జన్మించింది. నిధి అగర్వాల్ హైదరాబాద్లో పుట్టి బెంగళూరులో పెరిగారు. మార్వారీ కుటుంబంలో జన్మించిన ఆమె తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళం, కన్నడ కూడా బాగా మాట్లాడతారు.

 

విద్యశిల్ప్ అకాడమీ, విద్యా నికేతన్ పాఠశాలలోఆమె చదువుకున్నారు . ఆమె బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రి పట్టా పొందారు…బెల్లీ డాన్స్లో బాగా శిక్షణ పొందారు నిధి అగర్వాల్..

టైగర్ ష్రాఫ్తో కలిసి మున్నా మైఖేల్ చిత్రంలో అగర్వాల్ కథానాయకురాలి గా నటించారు.

 

2018 లో చందూ మొండేటి దర్శకత్వం లో విడుదల అయిన సవ్యసాచి చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు,

తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రం లో నటించారు. తర్వాత పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించారు.మున్నా మైఖేల్ చిత్రానికి 2018 వ సంవత్సరం లో జీ సినీ అవార్డ్స్ లో జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. టాలీవుడ్ లో ఆమెకి పలు అవకాశాలు వస్తున్నాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here