టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం – ప్రముఖ కో డైరెక్టర్ మృతి

టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం - ప్రముఖ కో డైరెక్టర్ మృతి

0

ఈ రోజు చిత్ర సీమలో వరుస విషాద వార్తలు వినాల్సి వస్తోంది… ఉదయం ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ మరణించారు అనే వార్త అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.. అందరూ కూడా ఆయనకు సంతాపం తెలిపారు ఈ వార్త మరువక ముందే మరో దారుణం జరిగింది టాలీవుడ్ చిత్ర సీమలో విషాద ఘటన జరిగింది.

 

తెలుగు చిత్ర సీమకు చెందిన ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోకి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

 

సీనీ కెరీర్లో కోడైరెక్టర్ సత్యం ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ల

దగ్గర వర్క్ చేశారు, అందరు స్టార్ హీరోలతో ఆయన వర్క్ చేశారు, ఇటు దర్శకులు హీరోలు హీరోయిన్లు ఆయనకు సంతాపం తెలిపారు.

 

రాజమౌళి సై చిత్రానికి చీఫ్ కో డైరెక్టర్గా వ్యవహరించారు.

మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా చేశారు

త్రివిక్రమ్ అల..వైకుంఠపురంలోకి కో డైరెక్టర్గా పనిచేశారు.

శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం సినిమాలకు కో డైరెక్టర్గా సేవలందించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here