వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా తాజాగా ఆయన తన బ్యారక్ మార్చాలని, లేకుంటే తన బ్యారక్‌లోకి మరికొందరు ఖైదీలనైనా పంపాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను 6*4 అడుగుల బ్యారక్‌లో ఉంచారని, ఇందులో మంచం కూడా పట్టడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది కచ్ఛితంగా సోలిటరీ కన్‌ఫైన్మెంట్ కిందికే వస్తుందని వంశీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
Vallabhaneni Vamsi | ‘నా బ్యారక్ మార్చండి’.. కోర్టుకెక్కిన వంశీ
-