పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్‌పీ(SRSP) కింద పొలాలను జగదీస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఎండిపోయిన పంటలు, రైతు కష్టాలు చూసి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. వారి కష్టాలు చూస్తుంటే మనసు తరుక్కుపోతోందన్నారు. కాళేశ్వరం నీరు అందిస్తే కేసీఆర్‌కు(KCR) పేరు వస్తుందని.. కాంగ్రెస్ నేతలు వాటిని నిలిపేశారని ఆరోపించారు. రైతులు కష్టాలను చూసి కూడా కాంగ్రెస్ గుండె కరగడం లేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. గోదావరిలో 10వేల క్యూసెక్కుల నీరు లభిస్తున్నా ఇసుక వ్యాపారం కోసం నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు జగదీష్ రెడ్డి.