శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఘటన స్థలం దగ్గరకు వెళ్లారు. అక్కడి పరిస్థితులపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్నవారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా సహకారం కావాలా? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సహాయక చర్యలను పరిశీలించి.. వివిధ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్(Revanth Reddy) పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కూడా మంత్రులకు సూచించినట్లు సమాచారం.