వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం(Mamnoor Airport) అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం శంషాబాద్ విమానాశ్రమానికి 150 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్‌పోర్ట్ ఉండకూడదన్న జీవీఆర్ ఒప్పందం నుంచి కూడా సదరు సంస్థతో చర్చించి ఈ ప్రాజెక్ట్‌కు మినహాయింపు సాధించారు. తాజాగా మామునూరు విమాశ్రయం గురించి కేంద్రం మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) మాట్లాడుతూ.. ఈ ఎయిర్‌పోర్ట్ స్వాతంత్ర్యం కన్నా ముందు నుంచి ఉందన్నారు. ఆ సమయంలో దేశంలోని అతిపెద్ద విమానాశ్రయం ఇదేనని వివరించారు. హైదరాబాద్ రాజధాని కావడం వల్లే మామునూరు విమానాశ్రయం శోభ సన్నగిల్లిందని వివరించారు.
‘‘2014కు ముందు దేశంలో 76 ఎయిర్‌పోర్ట్‌లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 159కి చేరింది. ఉడాన్ స్కీమ్(Udan Scheme) ద్వారా చిన్న నగరాలకు కూడా విమాన సౌకర్యం విస్తరించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర 696 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుత రన్‌వే 1600 మీటర్లు ఉంది. ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్‌వే కావాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ కాస్తంత ఆలస్యమైంది. గతంలో ఈ విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు బోలెడన్నీ చేశారు కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు’’ అని రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) చెప్పారు.