SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్‌పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సమయం ఉంది కానీ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని పరిశీలించడానికి, అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మాత్రం సమయం లేదంటూ ఎద్దేవా చేశారు. కాగా ఆదివారం ఎస్ఎల్‌బీసీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హరీష్ రావు నన్ను ప్రశ్నించేందంటూ చురకలంటించారు. ‘‘నన్ను ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని విమర్శిస్తున్న హరీష్ రావు… టన్నెల్ లో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా? హరీష్ రావు పాస్ పోర్టును ఒకసారి బయట పెట్టమనండి. కాదు అంటే ఆ వివరాలను నేను బయటపెడతా. ప్రమాదం తర్వాత రెండు రోజులు అబుదాబిలో దావత్ లో హరీష్ రావు మునిగి తేలాడు’’ అని రేవంత్(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.