కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనం చెందడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, పాలన చేతకాని సీఎం(Revanth Reddy) అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాది క్రితం తమ పార్టీ చెప్పింది ఇప్పుడు అక్షరసత్యమైందన్నారు. గతేడాది 10 శాతంగా ఉన్న జీఎస్టీ(GST) వసూళ్లు ఒక్కశాతానికి పడిపోవడం సిగ్గుచేటన్నారు కేటీఆర్(KTR). కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో(Finance) ఈ విధ్వంసం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం జరుగుతుందని విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దల కమిషన్లు ఆకాశాన్నంటుతున్నాయని, రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయని ఆరోపించారు కేటీఆర్.