Alapati Rajendra Prasad | కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ కూటమిదే..

-

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(Alapati Rajendra Prasad) ఎన్నికైనట్లు ఈసీ అధికారులు ప్రకటించారు. కాగా, ఫిబ్రవరి 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF)కి చెందిన K S లక్ష్మణరావుపై గెలుపొందారు.

- Advertisement -

టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్(Alapati Rajendra Prasad).. మిత్రపక్షాలు జనసేన, బీజేపీ మద్దతుతో 1,45,057 ఓట్లు సాధించగా.. మంగళవారం తొమ్మిదవ, చివరి రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగింపులో లక్ష్మణరావుకి 62,737 ఓట్లు పోలయ్యాయి. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని 3,47,116 ఓట్లలో 2,41,500 మంది ఓటర్లు తమ ఓట్లను వేశారు. 25,000 కంటే ఎక్కువ ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. విజేత, ఓడిన అభ్యర్థికి పోలైన ఓట్ల తర్వాత ఇది మూడవ అత్యధిక సంఖ్య కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధాన పోటీ రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ రావు మధ్య జరిగింది.

Read Also: సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...