అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది. స్థానికులు సమాచారం అందిచడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.