తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఇవ్వలేదని ఆ లేఖలో హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(10) ప్రకారం నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వ సమాధానాలను టేబుల్‌పై ఉంచాల్సి ఉంటుందని మాజీమంత్రి గుర్తుచేశారు. గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాలేదన్నారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రయోజనాల కోసం సభలో ప్రశ్నలు అడగడం, సకాలంలో సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ స్పీకర్‌ను కోరారు.