AP Govt – Rapido | మహిళల ఉపాధి కోసం ర్యాపిడోతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

-

AP Govt – Rapido | రాష్ట్రంలో మహిళలను సాధికారపరచే ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ ర్యాపిడోతో చేతులు కలిపింది. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఈ-బైక్‌ లు, ఈ-ఆటోలను అందించి.. వారిని ర్యాపిడోతో అనుసంధానిస్తుంది.

- Advertisement -

మొదటగా విశాఖపట్నం, విజయవాడలలో సుమారు 400 ఈ-బైక్‌ లు, ఈ-ఆటోలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తరువాత కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి జిల్లాల కేంద్రాల్లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ నగరాలకు మొత్తంగా మరో 200 వాహనాలు లభిస్తాయి. నివేదికల ప్రకారం, ప్రభుత్వం ముద్ర పథకం, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల కింద మహిళలకు వాహనాలు కొనుగోలు చేయడానికి రుణాలు ఏర్పాటు చేయనుంది.

AP Govt – Rapido | ర్యాపిడోతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ఈ వాహనాలను నడిపే మహిళలు మొదటి మూడు నెలలు కంపెనీకి ప్లాట్‌ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత వారు నెలకు రూ.1,000 చెల్లించాలి. బైక్ టాక్సీ కంపెనీ ప్రతి వాహనానికి నెలకు 300 బుకింగ్‌ లను అందిస్తుంది.

Read Also: భారత్ చేతిలో ఓటమి.. ఆటకు గుడ్‌బై చెప్పిన స్టీవ్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...