తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నట్లు నటిస్తున్నారో తనకు తెలుసని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజవర్గ అనుబంధ సంఘాలతో భేటీ నిర్వహించారు. ఇందులో మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తమ పనితీరుపై నేతలు నివేదికలు అందించారు.
ఈ సందర్భంగా ఆమె(Meenakshi Natarajan) మాట్లాడుతూ.. ‘‘మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటని తెలుసు. పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు. పార్టీ కోసం సమయం ఇవ్వండి. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి. అలాంటి వారిపై చర్యలు తప్పవు. నా పనితీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ(Rahul Gandhi).. సోనియా గాంధీకి(Sonia Gandhi) ఫిర్యాదు చేయొచ్చు. కానీ బయట మాట్లాడకండి’’ అని దిశానిర్దేశం చేశారామే.