Devendra Fadnavis – Chhaava | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీష్ వీక్షించారు. మూవీ చాలా బాగుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్ర చేత నిర్లక్ష్యం చేయబడిన మహావీరుల్లో శంభాజీ ఒకరన్నారు. శంభాజీని(Sambhaji Maharaj) చరిత్ర కారులు సరిగ్గా పట్టించుకోలేదన్నారు. ఆయన ధైర్యసాహసాలను ‘ఛావా’ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించార్నారు. యోధుల చరిత్రపై నేటి తరానికి ఈ సినిమా ఎంతో అవగాహన కల్పిందని Devendra Fadnavis చెప్పారు.
కాగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్(Abu Asim Azmi) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. శంభాజీని చిత్రవధ చేసిన ఔరంజేబును ప్రశంసించడాన్ని అధికారి కూటమి తీవ్రంగా పరిగణించి సదరు నేతపై మండిపడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అబు అసీమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాల ముగిసేవరకు అబు అసీమ్‌ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.