ఆర్టీసీ(TGSRTC) ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వెల్లడించారు. అదే విధంగా ఈ డీఏతో ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇది మహిళా దినోత్సవం నుంచి అమల్లోకి రానుంది. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.
దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహా లక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అభినందించారు.