ప్రభాస్ ముక్కుపై మోహన్ బాబు కామెంట్

ప్రభాస్ ముక్కుపై మోహన్ బాబు కామెంట్

0
102

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రభాస్ ఇద్దరు కలిస్తే మంచి సరదా సంభాషణ ఉంటుంది. అవును గతంలో కూడా వీరిద్దరు ఎక్కడ ఫంక్షన్లో కలిసినా అలా సరదాగా ఉంటారు అని అంటారు టాలీవుడ్ లో అందరూ… ఈ ఇద్దరు బుజ్జిగాడు సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్లు సొంతవాళ్ల కంటే ఎక్కువగా కలిసిపోతారు.

ఇద్దరు ఏ ఇళ్లల్లో ఫంక్షన్ జరిగినా కచ్చితంగా హజరు అవుతారు.. తాజాగా వీరి మధ్య ఫన్నీ సంఘటన ఒకటి జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ప్రభాస్ ముక్కు గురించి టాక్ నడిచింది, మీ ముక్కు చాలా షార్ప్ గా ఉంది అని కామెంట్ చేశారు.

తన ముక్కు చిన్నప్పటి నుంచి చాలా షార్ప్గా ఉంటుందని, దానితో టమోటాలు కోసేవాడినని ప్రభాస్ చెబుతూ.. మరి తమరేం కోసేవారని మోహన్ బాబు అడగ్గా అందుకు ఆయన కోడి మెడలు కోసేవాడినని సరదాగా నవ్వులు చిందిస్తూ చెబుతారు. మొత్తానికి ఇద్దరూ సరదాగా మాట్లాడిన మాటలు వీడియో రూపంలో షేర్ అవుతున్నాయి.