పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై నటి నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ తో కలిసి నటించడం చాలా సంతోషకర విషయమని చెప్పింది. దీనిని జీవితంలో వచ్చే చాలా అరుదైన అవకాశంగా భావిస్తానని తెలిపింది. బిగ్ స్టార్ల పక్కన నటిస్తూ ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేస్తోందీ చిన్నది. ‘రాజాసాబ్’లో ప్రభాస్ సరసన, పవన్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పవన్‌ను చూసి తాను చాలా నేర్చుకున్నానని తెలిపింది.
‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రానున్న ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. రెండున్నర నెలల పాటు గుర్రపుస్వారి, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం పవన్‌తో కలిసి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి నటిస్తున్నాను. ఆయన ఓ గొప్ప మేధావి. సాహిత్యంపై అపారమైన పట్టు ఉంది. ఆయనతో కలిసి నటించడం మర్చిపోలేని అనుభవం. మధ్యలో ఏపీ ఎన్నికలు రావడంతో.. పవన్ కల్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఆ సమయంలో షూటింగ్ ను కొన్ని రోజులు వాయిదా వేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్(Pawan Kalyan) తిరిగి షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారన్న భావన ఆయనలో ఇసుమంత కూడా కనిపించదు. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఆయనలో కొంచెం కూడా మార్పు రాలేదు’’అని నిధి(Nidhi Agarwal) చెప్పింది.