Half Day Schools | తెలంగాణలో రోజురోజుకీ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మండే ఎండల్లో పగటిపూట బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో స్కూల్స్ కి వెళుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మార్చ్ 15 నుంచి హాఫ్ డే స్కూల్స్(Half Day Schools) ఉంటాయని ప్రకటించింది.
అన్ని యాజమాన్యాల కింద ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థలలో మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 12.30 గంటలకు అందించబడుతుందని పేర్కొంది. 2024-25 విద్యా సంవత్సరానికి చివరి పని దినం ఏప్రిల్ 23. పాఠశాలలకు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరానికి స్కూల్స్ ఓపెన్ అవుతాయి.