కళాకారులను ప్రొత్సహించడం కోసం తెలంగాణలో గద్దర్ అవార్డులు(Gaddar Cine Awards) అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే ఈ అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానాలు విడుదల చేసింది TFDC. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా పరిశ్రమకు విశేష సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం.
దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని నిర్ణయించారు. ఈ అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏసీ గార్డ్స్‌లోని TFDC కార్యాలయంలో గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి.
ఈ గద్దర్ అవార్డులను(Gaddar Cine Awards) ఈ క్రింది కాటగిరీలలో ఇవ్వడం జరుగుతుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
*ఫీచర్ ఫిల్మ్స్
* జాతీయ సమైక్యతపై చలన చిత్రం
*బాలల చలన చిత్రం
*పర్యావరణం/హెరిటేజ్/ చరిత్ర లపై చలన చిత్రం
*డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్
*యానిమేషన్ ఫిలిం
*సోషల్ ఎఫక్ట్ ఫిల్మ్స్
*డాక్యుమెంటరీ ఫిల్మ్స్
*షార్ట్ ఫిల్మ్స్
ఇతర కాటగిరీలు
*తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు.
*ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు