బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరవుతారా లేదా అన్న అంశం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారగా. వీటికి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీకి తాను వస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిద్దామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని పిలుపిచ్చారు.