Spirit | ‘స్పిరిట్’లో రవితేజ కొడుకు.. ఎలా అంటే..?

-

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న ‘స్పిరిట్(Spirit)’ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా హిట్ టాక్ అందుకుంటుంది. హీరో పాత్రని ఎలా చూపించాలో సందీప్‌కు బాగా తెలుసని, అందులోనూ ప్రభాస్‌ను(Prabhas) పోలీస్ గెటప్‌లో అంటే సందీప్ చించేస్తాడని అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం మాస్ మహారాజ కుమారుడు మహాధన్ కూడా పనిచేస్తున్నాడట. ఇప్పటికే ‘రాజా ది గ్రేట్’లో రవితేజ చిన్నప్పటి పాత్రల్లో మహాధన్ కనిపించి.. మెప్పించాడు. హీరో కటౌట్ అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు అతడు ‘స్పిరిట్’ సెట్స్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో.. ఇక సోలో హీరోగా అరంగేంట్రమే బాకీ అని అంతా అనుకున్నారు. ఇంతలో మహాధన్ భారీ షాక్ ఇచ్చాడు.

- Advertisement -

స్పిరిట్(Spirit) సినిమాలో తాను యాక్టర్‌గా పనిచేయడం లేదట. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సందీప్ దగ్గర డైరెక్షన్ నేర్చుకోనున్నాడట. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వార్త విన్న రవితేజ(Raviteja) అభిమానులు డీలా పడిపోయారు. హీరోహీరో అని ఎంకరేజ్ చేస్తే ఇలా చేశాడేంటీ అని అంటున్నారు. స్పిరిట్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ కొడుకులతో పాటు రవితేజ కొడుకు మహాధన్(Mahadhan Bhupatiraju) అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయబోతున్నాడు. ఇప్పటికే మరో 12 నుంచి 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. కానీ ఒక స్టార్ హీరో కుమారుడుతో పాటు ఒక స్టార్ డైరెక్టర్ కుమారులైన ఇద్దరూ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేయబోతూ ఉండడం హాట్ టాప్ పిక్ అవుతోంది.

Read Also: వార్-2 వాయిదా తప్పదా..?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది: రేవంత్

విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth...

Revanth Reddy | ప్రతి ఎమ్మెల్యేతో భేటీ అవుతా: రేవంత్

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి...