మాజీ సీఎం కేసీఆర్‌ను(KCR), ఫిరాయింపు నేత, పటాన్‌చెర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. అసెంబ్లీలో కలిశారు. వారిద్దరు భేటీ కావడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఫిరాయింపు నేతల అంశం సుప్రీంకోర్టులో ఉంది. బుధవారం ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి.. కేసీఆర్‌ను కలవడం కీలకంగా మారింది. ఆయన మళ్ళీ పార్టీ మారననున్నారా? కారు ఎక్కడానికి సిద్ధంగా ఉండి.. ఆ విషయంపై చర్చించడానికే కేసీఆర్‌తో భేటీ అయ్యారా? అన్న వార్తలు క్షణాల్లోనే రాష్ట్రమంతా చర్చలకు దారితీశాయి. అయితే అటువంటిది ఏమీ లేదని మహిపాల్ రెడ్డి అనుచరులు స్పష్టం చేశారు. తన తమ్ముడి కొడుకు పెళ్లికి ఆహ్వానించడం కోసమే మహిపాల్ రెడ్డి(Mahipal Reddy).. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. ఈ మేరకు పెళ్ళి ఆహ్వాన పత్రిక అందించారని, ఆ మేరకు కేసీఆర్ కలిసి మాట్లాడారని చెప్పారు.