Nagababu | చంద్రబాబు, పవన్ లకు నాగబాబు కృతజ్ఞతలు

-

జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తన ఎన్నికను ఖరారు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాగబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో తన బాధ్యతను పెంచిన సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ X లో పోస్ట్ చేశారు.

- Advertisement -

“ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. నాతో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, బి. తిరుమల నాయుడు, రవిచంద్ర బీద గార్లకు శుభాకాంక్షలు. నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, బీజేపీ శాసనపక్ష నేత శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు. నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు శ్రీ మండలి బుద్ద ప్రసాద్, శ్రీమతి లోకం నాగ మాధవి, శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ పంతం నానాజీ గారికి అభినందనలు. నా ఇన్నేళ్ళ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు” అని నాగబాబు(Nagababu) ట్వీట్ చేశారు.

Read Also:  గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Raghunandan Rao | టీటీడీ వివక్షపై పార్టీలకు అతీతంగా తిరుమలలో తేల్చుకుంటాం – బీజేపీ ఎంపీ

టీటీడీ పాలకమండలి పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అసంతృప్తి...

Group 3 Results | గ్రూప్-3 ఫలితాలు వచ్చేశాయి..

తెలంగాణ గ్రూప్-3 రిజల్ట్స్‌ను(Group 3 Results) టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు....