తమిళనాడు బడ్జెట్‌లో రూపాయి చిహ్నాన్ని(Rupee Symbol) మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూపాయి చిహ్నాన్ని ఎలా మారుస్తారు? అని కొందరు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తి చేశారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి చిహ్నాన్ని మార్చడంపై మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం(Chidambaram) స్పందించారు. రూపాయి చిహ్నాన్ని మార్చడం అసలు సమస్యే కాదన్నారు. రూపాయి చిహ్నాన్ని నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. శివగంగైలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యానిధి ఇవ్వకపోయినా ఆ భారాన్ని తమిళనాడు ప్రభుత్వమే(Tamil Nadu Govt) భరిస్తున్నట్లు డీఎంకే(DMK) ప్రభుత్వం ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇకపై అయినా కేంద్రం.. తమిళనాడుకు ఇవ్వాల్సిన నిధులను సక్రమంగా అందిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. రూపాయి చిహ్నం ఆయా భాషల ప్రకారం సూచిస్తారని, పత్రాల్లో ఆంగ్లంలో ఆర్ఎస్ అన్న అక్షరాలే ఉపయోగిస్తామని గుర్తు చేశారు. అదే విధంగా తమిళనాడు బడ్జెట్‌లో రూపాయి చిహ్నం మార్చడం అసలు సమస్యే కాదని, ఏ రూపాయి చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాం అన్నది సమస్యే కాదని ఆయన(Chidambaram) చెప్పుకొచ్చారు.