తెలంగాణ అసెంబ్లీ సమాశాలు హీటెక్కుతున్నాయి. సోమవారం సభ జరుగుతున్న తీరుపై ఎంఐఎంనేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది శాసనసభ అన్న అనుమానం కలుగుతుందన్నారాయన. ఇది అసెంబ్లీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారని, గాంధీ భవన్ అన్నట్లు ఫీల్ అవుతున్నారంటూ అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీని నడపడం చేతకావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శాసనసభను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ఇది గాంధీభవన్(Gandhi Bhavan) కాదు తెలంగాణ శాసనసభ’’ అని అక్బరుద్దీన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కీలకంగా మారాయి.