Journalist Revathi | రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్ ఖరారు..

-

జర్నలిస్ట్ రేవతి(Journalist Revathi), తన్వి యాదవ్‌కు(Tanvi Yadav) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా తిడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో సీఎంను తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జర్నలిస్ట్ రేవతి, తన్వీ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వారికి రిమాండ్ విధించిన కోర్టు.. సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీ కత్తు, ప్రతి సోమ, మంగళవారం విచారణకు రావాలన్న షరతులతో బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం.

Read Also: చంద్రయాన్ 5 కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. దీని విశేషమేమంటే?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Criminal Cases | క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలో ఏపీ, తెలంగాణ టాప్

క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్న ఎక్కువమంది ఎమ్మెల్యేల లిస్టులో తెలుగు రాష్ట్రాలు...