అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కొన్నాళ్లపాటు ట్విట్టర్ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్(Truth Social)’ను ప్రారంభించారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. ఇందులో ఖాతాను తెలిరాచు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్రంప్‌తో దిగిన ఫొటోను మోదీ పంచుకున్నారు. ‘ట్రూత్ సోషల్’లో చేరడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదికగా మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని మోదీ చెప్పారు.
ఇటీవల ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ వీడియోను ‘ట్రూత్ సోషల్’ ద్వారా ట్రంప్ షేర్ చుసుకున్నారు. దానిపై మోదీ స్పందిస్తూ.. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాలు సహా సాంస్కృతిక విశేషాలతో పాటు తన జీవిత ప్రయాణం ఇలా అనేక విషయాలు ఆ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడానని మోదీ(PM Modi) చెప్పారు.