నటుడు, మాజీ వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను విచారించనున్నారు. సీఐడీ అభ్యర్థన మేరకు విచారణ కోసం ఆయనను కస్టడీకి అనుమతిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, విలేకరుల సమావేశంలో మార్ఫింగ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలను చూపించడం వంటి ఆరోపణలపై పోసాని కృష్ణమురళిపై కర్నూలులో కేసు నమోదైంది. పీటీ వారెంట్ పై ఆయనను కర్నూలు నుంచి గుంటూరుకు తరలించారు. గతంలో కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించగా జిల్లా జైలులో ఉంచారు. తదుపరి విచారణ కోసం ఆయనను(Posani Krishna Murali) కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఒక రోజు కస్టడీకి మంజూరు చేసింది.