Aadhaar Voter Card | దేశంలో ఓటర్ల సంఖ్య, ఓటింగ్ ప్రక్రియపై ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలకు చెక్ పెట్టాలని జాతీయ ఎన్నికల సంఘం నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే ఓటర్ కార్డును, ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని డిసైడ్ అయింది. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిద్య చట్టం-1950, సుప్రీంకోర్టుు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధానం జరపనున్నట్లు తెలిపింది ఈసీ.
ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య అతిత్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞనేష్ కుమార్, కమిషనర్ల సుఖ్‌బిర్ సింగ్ సందు(Sukhbir Singh Sandhu), వివేక్ జోషీలు(Vivek Joshi) మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూడీఏఐతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశాలు నిర్వహించారు.
Aadhaar Voter Card | ఆర్టికల్ 326 ప్రకారం భారతీయ పౌరులు మాత్రమే ఓటు హక్కు పొందగలరు. ఆధార్ అనేది కేవలం భారత పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు. వ్యక్తిని భారతీయుడా కాదా అని గుర్తించడానికి ఆధార్ ఉపయోగపడుతుంది. అందుకే ఓటర్లు గుర్తింపు కార్డు(EPIC)ని ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబందనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.