Vallabhaneni Vamsi | వల్లభనేని వంశీకి రిమాండ్

-

వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 1 వరకు రిమాండ్‌లో ఉండనున్న వంశీని నాంపల్లి కోర్టు నుంచి విజయవాడకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులని చెప్పుకుని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనడానికి సదరు మహిళతో తాను ఒప్పందం కుదుర్చుకున్నానంటూ శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.

- Advertisement -

ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi ) ఏ2గా, రాము, రంగా అనే మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. గన్నవరం కోర్టులో(Gannavaram Court) ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వంశీని.. విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు.

Read Also: ఆధార్-ఓటర్ కార్డ్ అనుసంధానం.. ఈసీ ప్రకటన
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...