Revanth Reddy | బీసీ రిజర్వేషన్ల పోరాటానికి నాయకత్వం వహిస్తా: రేవంత్

-

బీసీ రిజర్వేషన్లు(BC Reservations) సాధించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. బలహీన వర్గాలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటాన్ని ముందుండి నడిపిస్తానని, ఈ పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని సీఎం ప్రకటించారు. కుల సర్వేను తమ ప్రభుత్వం పారదర్శకంగా, నిబద్దతో నిర్వమించిందని, ఈ సర్వేను తప్పుబడితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు.

- Advertisement -

“2026 లో జరిపే జన గణనలో కులగణన చేర్చాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. మనం అందరం కలిసి కొట్లాడితే కుల గణనను ఎందుకు చేర్చరు. కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా? కొట్లాడితే జన గణనలో కుల గణన ఎందుకు చేర్చరు. జన గణనలో ఒకసారి కులగణన చేర్చితే ఆ తర్వాత ప్రతి పదేళ్లకోసారి మరింత స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగస్వాములం కావడం మాకు గర్వకారణంగా ఉంది. దీన్ని తప్పుబడితే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బలహీన వర్గాలు తమ హక్కుల సాధన కోసం చేసే పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడుతా’’ అని భరోసా Revanth Reddy ఇచ్చారు.

‘‘ఈ సర్వే పునాది లాంటిది. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చు. ఈ కుల గణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని భావించే వారి ఉచ్చులో పడొద్దు” అని హితవు చెప్పారు.

Read Also: ఆధార్-ఓటర్ కార్డ్ అనుసంధానం.. ఈసీ ప్రకటన
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Potato Recipe | స్పైసీగా తినాలనిపిస్తోందా.. సింధీ ఆలూ తుక్ ట్రై చేయండి..

Potato Recipe | ఒక్కోసారి స్పైసీగా తినాలన్న జిహ్వ తెగ లాగేస్తుంటుంది....

Chandrababu | బిల్ గేట్స్ చంద్రబాబు భేటీ… జరిగిన కీలక ఒప్పందాలు

ఫిలాంత్రఫిస్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates), ఏపీ...