రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారిస్తానని ట్రంప్(Donald Trump) హామీ ఇచ్చారు. కాగా, ఈ క్రమంలోనే మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు(Vladimir Putin) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా చర్చించారు. కాగా ఈ ఫోన్ కాల్ గురించి ట్రంప్ ముందుగానే సమాచారం అందించారు. పుతిన్‌తో ఫోన్లో మాట్లాడనున్నట్లు చెప్పారు. ఇందులో భూమి, విద్యుత్‌కేంద్రాలు, కొన్ని ఆస్తుల విభజనపై చర్చిస్తామని ట్రంప్ చెప్పారు. చెప్పినట్లుగానే మంగళవారం ఆయన పుతిన్‌కు ఫోన్ చేశారని, రెండు గంటలకుపైగా చర్చించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
కాగా, అమెరికా ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ముగిస్తానని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ దిశగానే ట్రంప్ చర్చలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. పుతిన్ కూడా అంగీకారం తెలుపుతూనే కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, వాటిపై అమెరికాతో చర్చిస్తానని అన్నారు. మంగళవారం ట్రంప్‌తో(Donald Trump) ఫోన్‌లో జరిగిన చర్చల్లో ఈ అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.