Telangana Budget 2025 | తెంలగాణ బడ్జెట్ కేటాయింపులిలా

-

Telangana Budget 2025 | తెలంగాణ అసెంబ్లీదలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సమర్పించారు. ‘‘తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం అందించారు. ప్రజలకు జబావుదారీతనంగా ఉంటూ పాలన కొనసాగిస్తాం. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని నిందితూ ఆరోపణలు చేస్తున్నారు’’ అని భట్టి అన్నారు.

- Advertisement -

‘‘2023 డిసెంబర్ 9 న మహాలక్ష్మి పథకం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 7227 బస్సుల్లో 149.63 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీని ద్వారా 5005.95 కోట్లు మహిళలకు ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 69 శాతం గా ఉన్న ఆర్టీసీ అక్యూపెన్సి రేషియో 94 శాతానికి పెరిగింది. మహా లక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ అక్యుపెన్సి రేషియో 100 శాతం నమోదు అవుతుంది. దీని వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీ కి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తుంది’’ అని భట్టి చెప్పుకొచ్చారు.

Telangana Budget 2025 శాఖల వారీగా కేటాయింపులిలా..

తెలంగాణ బడ్జెట్ 2025-26 3,04,965 కోట్లు..

రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు..

మూలధన వ్యయం 36,504 కోట్లు..

వ్యవసాయ శాఖ 24,439 కోట్లు కేటాయింపు..

పశు సంవర్దక శాఖ కు 1,674 కోట్లు కేటాయింపు..

పౌరసరఫరాల శాఖ కు 5,734 కోట్లు కేటాయింపు..

విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయింపు..

మహిళా, శిశు సంక్షేమానికి 2,862 కోట్లు కేటాయింపు..

ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయింపు..

ఎస్టి సంక్షేమానికి 17,169 కోట్లు కేటాయింపు..

బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు కేటాయింపు..

మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు కేటాయింపు..

ఐటీ శాఖకు 7,74 కోట్లు..

వైద్య ఆరోగ్యశాఖకు 12,393 కోట్లు కేటాయింపు..

విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపు..

H సిటి డెవలప్మెంట్ కి 150 కోట్లు కేటాయింపు..

MA & UD శాఖకు 17,677 కోట్లు కేటాయింపు..

నీటి పారుదుల శాఖకు 23,373 కోట్లు కేటాయింపు..

రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయింపు..

పర్యాటకశాఖ కు 775 కోట్లు కేటాయింపు..

క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయింపు..

ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు కేటాయింపు..

దేవాదాయశాఖ కు 190 కోట్లు కేటాయింపు..

హోంశాఖ కు 10,188 కోట్లు కేటాయింపు..

పంచాయతీ రాజ్ శాఖ..31,605 కోట్లు

హోంశాఖ.. పదివేల 10188 కోట్లు.

టూరిజం 775 కోట్లు

Read Also: పుతిన్‌కు ట్రంప్ ఫోన్.. యుద్ధం గురించి మాట్లాడటానికే..!
Follow Us on : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Potato Recipe | స్పైసీగా తినాలనిపిస్తోందా.. సింధీ ఆలూ తుక్ ట్రై చేయండి..

Potato Recipe | ఒక్కోసారి స్పైసీగా తినాలన్న జిహ్వ తెగ లాగేస్తుంటుంది....

Chandrababu | బిల్ గేట్స్ చంద్రబాబు భేటీ… జరిగిన కీలక ఒప్పందాలు

ఫిలాంత్రఫిస్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates), ఏపీ...