Potato Recipe | స్పైసీగా తినాలనిపిస్తోందా.. సింధీ ఆలూ తుక్ ట్రై చేయండి..

-

Potato Recipe | ఒక్కోసారి స్పైసీగా తినాలన్న జిహ్వ తెగ లాగేస్తుంటుంది. కానీ ఏం తినాలో అర్థం కాక.. చాలా మంది సతమతమవుతుంటారు. ఎన్ని ట్రై చేసినా జిహ్మ సంతృప్తి కూడా చెందదు. వీరిలో మీరు కూడా ఉంటే.. సింధి ఆలూ తుక్ ట్రై చేయాల్సింది. ఇది ఒక్కసారి తిన్నారంటే జీవితంలో వదిలిపెట్టరు. రొటీన్‌గా తినేవి మనకు ఉండే స్పైస్ క్రేవింగ్స్‌ను తగ్గించలేవు. వారికి బంగాళదుంపలో తయారు చేసే సింధి ఆలూ తుక్ వంటకం మన నాలుకను లబలబలాడించడం ఖాయం. వెజిటేరియన్స్‌కు ఇది ఒక సూపర్ ఫుడ్. ఆలూతో తయారు చేసే ఈ వంటకానికి బడాబడా మూవీ స్టార్స్ కూడా ఫిదా అయిపోయారు తెలుసా. కరీనా కపూర్ కూడా ఈ సింధి ఆలూ తుక్‌కు పెద్ద ఫ్యాన్. మరి ఈ డిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

- Advertisement -

కావాల్సిన పదార్థాలు: 7-8 పెద్ద బంగాళదుంపలు, చెంచా ఉప్పు, అర చెంచా కొత్తిమీర పొడి, అర చెంచా కారం, చెంచా చాట్ మసాలా, అర చెంచా ఆమ్ చూర్ పొడి, రెండు మూడు మిరపకాయలు, నిమ్మకాయ సగం, చిటికెడు పసుపు, కొత్తిమీర, కాస్తంత నూనె.

తయారీ విధానం: బంగాళ దుంపలు పెద్దవి తీసుకుంటే వాటిని పెద్దపెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ చిన్నచిన్న బంగాళదుంపలు తీసుకుంటే వాటిని బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి. ఆలూ 90శాతం ఉడికిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టడానికి ముందే చిన్న ముక్కలుగా కట్ చేస్తే.. అవి ఉడికే సమయంలో గుజ్జుగుజ్జుగా మారిపోతాయి. కాబట్టి ఉడకబెట్టిన తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళదుంపల ముక్కలను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపైన ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. మంటను తక్కువగా పెట్టుకోవాలి. నూనె మరీ వేడి కాకుండా చూసుకోవాలి. అందులో ఆలూ ముక్కలు వేసి 5-7 నిమిషాలు వేయించుకోవాలి. అవి లోపల వరకు వేగాయని నిర్ధారించకున్న తర్వాత బంగాళదుంపలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలూ మరింత క్రిస్పీగా కావాలంటే డబుల్ ఫ్రూ పద్దతిని కూడా వినియోగించుకోవచ్చు.

Potato Recipe | బంగాళదుంపలు బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆలూ ముక్కల్లో చాట్ మాసాలా, ఆమ్ చూర్ పౌడర్, కారం, నిమ్మరసం, సన్నగా తరిగిన మిరపకాయలు(కావాలంటే), చిటికెట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు మరోసారి వేయించుకోవాలి. ఇక అంతే వేడివేడి సింధి ఆలూ తుక్ రెడీ. కాస్తంత కొతిమీర చట్టుకుని లాగించేయడమే. ఇది కారం కారంగా.. పుల్ల పుల్లగా ఉండి మనకు కలిగే స్పైస్ క్రేవింగ్స్‌ సరదా తీర్చేస్తుంది.

Read Also: 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Betting Apps | 2024 లో వెయ్యికిపైనే బెట్టింగ్ వెబ్సైట్స్ బ్యాన్ చేసిన కేంద్రం

Betting Apps | దేశంలో ఆన్‌ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను...

Chandrababu | బిల్ గేట్స్ చంద్రబాబు భేటీ… జరిగిన కీలక ఒప్పందాలు

ఫిలాంత్రఫిస్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates), ఏపీ...