Revanth Reddy | చెన్నైలో రేవంత్ పాల్గొనే జేఏసీ వివరాలివే..

-

నియోజకవర్గాల పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(MK Stalin) ఆధ్వర్యంలో చెన్నైలో శనివారం నిర్వహించనున్న సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొననున్నారు. చెన్నై గిండీలోని ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.. సమావేశంలో పాల్గొనేందుకుగాను శుక్రవారం రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు.

- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా ఏవిధంగా నష్టపోతాయనే అంశంపై ఇప్పటికే పలు వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలియజేశారు.. చెన్నై సమావేశంలోనూ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తన వాదనను దేశ ప్రజల ముందుంచనున్నారు.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అనంతరం తమిళనాడు, కేరళ, పంజాబ్ ముఖమంత్రులు ఎం. కె. స్టాలిన్, పినరయి విజయన్(Pinarayi Vijayan), భగవంత్ మాన్(Bhagwant Mann) లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడనున్నారు.

Read Also: రూ.16.70 లక్షల కోట్లతో ఏం కట్టారు.. బీఆర్ఎస్ కు భట్టి ప్రశ్నలు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Srinivas Goud | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది: మాజీ మంత్రి

ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్...

Hyderabad | స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

హైదరాబాద్(Hyderabad) స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది....