ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని(Kodali Nani) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి(Gachibowli AIG Hospital) తరలించారు. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి రావడంతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. నాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
అయితే కొడాలి నానికి(Kodali Nani) ఛాతీ నొప్పి రావడంతో హార్ట్ ఎటాక్ కి గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ బారిన పడి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. దీంతో అసలు ఆయనకి ఏమైంది అనే విషయంపై నాని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.