మార్చి 26 బుధవారం ముంబైలో అందాల నటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) లగ్జరీ కారును స్థానిక బస్సు ఢీకొట్టింది. అయితే ఆ వాహనంలో ఐశ్వర్య కానీ ఇతర బచ్చన్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో అటు ఐశ్వర్య, బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కాగా ఐశ్వర్య దగ్గర ఉన్న అన్ని కార్ల నంబర్ ప్లేట్‌లో ‘5050’ కామన్ గా ఉంటుంది. ఈ విధంగానే పాపరాజ్జీ అది ఐశ్వర్య వాహనం అని గుర్తించారు.
ఐశ్వర్య కారును బస్సు ఢీకొట్టిన సమయంలో కొంతమంది ఘటనాస్థలంలో గుమిగూడారు. ఆ సమయంలో నటి వాహనం లోపల ఉన్నట్టు కానీ, చుట్టుపక్కల కానీ కనిపించలేదు. కారు డ్రైవర్ మాత్రం బయటకు వచ్చి కారుకి డ్యామేజ్ అయిందేమో అని చూస్తూ కనిపించాడు. అనంతరం బస్సు, ఐశ్వర్య కారు విడివిడిగా వెళ్లిపోయాయి.
కాగా, ముంబైలో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్న ఐశ్వర్య(Aishwarya Rai) కారు టయోటా వెల్‌ఫైర్ విఐపి ఎగ్జిక్యూటివ్ లాంజ్ మోడల్. ఈ కారు ధర రూ.1.30 కోట్లు. ఆమె గత సంవత్సరమే ఈ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఐశ్వర్యతో పాటు, టయోటా వెల్ ఫైర్ కార్లను అక్షయ్ కుమార్, సంజయ్ కపూర్, అజయ్ దేవగన్, రాకేష్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు. ఈ వాహనం సౌకర్యంతో పాటు విలాసవంతంగా ఉండటంతో ప్రముఖులు కొనుగోలు చేసేందుకు కొనుగోలు చేస్తున్నారు.
ఇటీవల పలుచోట్ల ఐశ్వర్య ఈ కారులో కనిపించింది. భర్త అభిషేక్‌తో పాటు, ఆమె రోల్స్ రాయిస్ ఘోస్ట్ (₹6.95 కోట్లు), ఆడి A8L (₹1.34 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ S500 (₹1.98 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ S350d కూపే (₹1.60 కోట్లు), లెక్సస్ LX 570 (₹2.84 కోట్లు) కార్లను కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.