Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

-

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి కూడా పంపింది. తాజాగా ఇదే అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy).. పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో ఈ అంశంపై జలశక్తి శాఖ సహాయక మంత్రి రాజ్ భూషణ్ చౌదరి(Raj Bhushan Choudhary) లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అందులో పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పారు.

- Advertisement -

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వెనక్కు పంపేసింది. కృష్ణా నది జలాలపై ఆంధ్ర, తెలంగాణ మధ్య భారీ వివాదం జరుగుతుందని, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతుందని కేంద్రం గుర్తు చేసింది. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్(Palamuru Rangareddy Project) టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్‌సభలో కేంద్రం వివరించింది. 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, 2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనలను తిప్పి పంపామని కేంద్రం చెప్పింది.

Read Also: అందమైన భార్య గొంతుకోసి, కాళ్ళు మడిచి… సైకో భర్త దారుణం
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...