Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

-

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా ఫీజు చెల్లించుకోవాల్సి వచ్చింది. తన పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పించబోయి అతనే ప్రేమ పాఠాలు ఒంటబట్టించుకున్నాడు, చివరికి జీవితంలో కోలుకోలేని గుణపాఠం నేర్చుకున్నాడు. ఇంతకీ ఏమైందంటే ఓ ప్రీ స్కూల్ నిర్వాహకురాలు వ్యాపారిపై వలపు వల విసిరి రూ.17 లక్షలు కాజేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… బెంగుళూరు(Bengaluru) మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి 2023 లో తన పిల్లలను శ్రీదేవి నిర్వహించే ప్రీ స్కూల్లో చేర్పించాడు. ఈ క్రమంలో శ్రీదేవికి, వ్యాపారికి పరిచయం ఏర్పడడంతో, స్కూల్ నిర్వహణతో పాటు ఇతర ఖర్చులకు రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని 2024 లో చెల్లిస్తానని చెప్పింది. ఆ తరువాత వారి మధ్య స్నేహం ముందుకెళ్లింది. శ్రీదేవి ఆ వ్యాపారి దగ్గర ఒక ముద్దుకు రూ.50 వేలు వసూలు చేసేది.

అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించాలని శ్రీదేవిని వ్యాపారి అడగగా… ఏం కావాలో చెప్తే సెటిల్ చేసుకుందాం అని బదులిచ్చింది. దీంతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండమని వ్యాపారి కోరడంతో రూ.15 లక్షలు వసూలు చేసి సరేనని చెప్పింది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో శ్రీదేవి మార్చి 12న వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం తన భర్తను పంపమని చెప్పింది. వ్యాపారి అక్కడికి వెళ్ళేసరికి.. ఆమె ముందుగానే అరేంజ్ చేసిన బీజాపూర్ కు చెందిన గణేష్ కాలె, సాగర్ అనే రౌడీ షీటర్లు అక్కడ ఉన్నారు. డబ్బుకోసం వారు వ్యాపారితో గొడవపడ్డారు. వాగ్వాదం అనంతరం రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని, రూ.1.90 లక్షలు అడ్వాన్స్ గా తీసుకొని రౌడీ షీటర్లు వ్యాపారిని వదిలేశారు.

అయితే డబ్బుపై ఆశ చావని శ్రీదేవి రూ.20 లక్షలు కాదని, వ్యాపారి నుంచి రూ.50 లక్షలు దోచుకోవాలని చూసింది. దీంతో మార్చి 17న వ్యాపారికి ఫోన్ చేసి తన ఫోన్ లో ఉన్న చాట్ డిలీట్ చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చాట్ అందరికీ చూపిస్తా అని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు శ్రీదేవిని, ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: 6 గంటలకు మించి కూర్చుంటే ఇక అంతే సంగతులు..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...