గత కొద్దికాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం కొనసాగుతోంది… జగన్ ముఖ్యమంత్రి అయిన మూడు నెలల తర్వాత పవన్ తన గళాన్ని విప్పారు…. సర్కార్ కు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు కూడా చేశారు….
అందులో భాగంగానే నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు…. ఇప్పుడు మన నది మన నూడి కార్యక్రమం చేయనున్నారు… అయితే తాజాగా సర్కార్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ విద్యభోదనను పవన్ ముందునుంచి వ్యతిరేకిస్తున్నారు…. దీనికి వైసీపీ కౌంటర్ కూడా ఇస్తుంది… ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించే నాయకుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయారు…
ఇక ప్రజలు కూడా ఈ విషయం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు… తాజాగా ఇంగ్లీష్ మీడియం విషయంలో పవన్ యూటర్న్ తీసుకున్నారు…. ముందు నుంచి ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని కానీ తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుకుంటున్నామని పవన్ అన్నారు… ఓట్లు పడతాయా లేదా అనే దాని గురించి కాకుండా ప్రజలకు మేలు కలుగుతుందాలేదా అనే యోచనలో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు…