ర‌జ‌నీకాంత్ 168 పై బిగ్ అప్ డేట్

ర‌జ‌నీకాంత్ 168 పై బిగ్ అప్ డేట్

0
95

తలైవా రజనీకాంత్ 168వ చిత్రానికి సంబంధించి ఓవార్త కోలీవుడ్ లో వైరల్ అవుతోంది, రజని సినిమా అంటేనే ఓ క్రేజ్ , తాజాగా దర్బార్ సినిమా చేశారు ఆయన, అది వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది, ఇక వరుసగా తన సినిమాలను పట్టాలపై పెట్టే రజనీ మరో సినిమాని కూడా ఫిక్స్ చేశారట.

ఈ కొత్త చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ 5నుండి ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్‌పిక్చ‌ర్స్‌ నిర్మాణంలో డైరెక్ట‌ర్ శివ ఈ సినిమాను తెర‌కెక్కిసున్నారు, అంతే కాదు మెయిన్ క్రూలో చూసుకుంటే ఇందులో రజనీ సరసన కీర్తి సురేష్ జ్యోతిక పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి డి.ఇమామ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక క్రేజీ ప్రాజెక్ట్ దర్బార్ ని మురుగదాస్ తీస్తున్నారు ఇటీవల ఈ సినిమా గురించి డబ్బింగ్ గురించి మురుగదాస్ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే ,168 వ చిత్రానికి వ్యూహం అనే టైటిల్ ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్.