చాలా రోజులుగా రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదాా అనే మీమాంస కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది సీఎం జగన్ ని ఈ విషయంలో తప్పు పడుతున్నారు. ఓ పక్క నిర్మాణాలు లేక అమరావతి ఖాళీగా ఉంది అని పెట్టుబడి పెట్టిన వారు రైతులు నష్టపోతున్నారు అని విమర్శలు ఆరోపణలు చేశారు.
అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క రాజధాని మార్పు ఉంటుంది అని వార్తలు వస్తుంటే , తాజాగా జగన్ సీఆర్డీఏ మీటింగులో రాజదాని ప్రాంతంలో ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చేపడుతున్న పనులు అన్నింటినీ యథావిధిగా కొనసాగించాల్సిందిగా సూచించారు. నిధులను వెంటనే విడుదల చేస్తాం అని కూడా అన్నారు.75 శాతం పనులు పూర్తి అయినవి అన్నీ పూర్తి చేయాలి అని తెలియచేశారు.
అయితే రాజధాని మరే ప్రాంతానికి తరలి పోదు అనే భరోసా అయితే జగన్ కల్పించారు.. కొన్ని సంస్ధలు ప్రభుత్వ కార్యాలయాలు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి అని జగన్ ఆలోచిస్తున్నారట.