సంచలనం గేదె కొమ్ములకు కూడా వైసీపీ రంగులు…

సంచలనం గేదె కొమ్ములకు కూడా వైసీపీ రంగులు...

0
88

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ సచివలాయాలకు పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు… ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ పార్టీ కలర్ రంగులు వేస్తున్నారని వారు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…

కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. విజయనగరం జిల్లాలో జాతిపితి మహాత్మగాంధీ విగ్రహాని అలాగే అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది… తాజాగా ప్రకాశం జిల్లాలో గేదెల కొమ్ములకు కూడా వైసీపీ కలర్ రంగులు వేశారు…

పర్చూరి నియోజకవర్గంలో దారిలో రెండు గేదెలు వెల్తున్న సమయంలో వాటికి వైసీపీ కలర్ రంగులు వేశారు… ఇది కాస్త కెమెరాకు చిక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి… మరి టీడీపీ నాయకులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి…