ఉదయ్ కిరణ్ బయోపిక్ లో మరో క్రేజీ హీరో

ఉదయ్ కిరణ్ బయోపిక్ లో మరో క్రేజీ హీరో

0
132

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్, అయితే అవకాశాలు లేక ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఇప్పటికీ సూపర్ హిట్ అనే చెప్పాలి.

అయితే టాలీవుడ్ లో ఉదయ్ బయోపిక్ తెరకెక్కనుంది అని వార్తలు వస్తున్నాయి… చిత్ర యూనిట్ ఈ సినిమాకి ఇప్పటికే వర్క్ చేస్తోందట, అయితే సందీప్ కిషన్ తో ముందు ఈ సినిమా చేయించాలి అని అనుకున్నారు .. కాని ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట , మెగా కుటుంబం నుంచి దూరం అవుతాము అనే ఉద్దేశ్యంతో కొందరు హీరోలు ఈ చిత్రం చేయడానికి ముందుకు రావడం లేదు అనే టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.

అయితే తాజాగా ఈ పాత్రకు హీరో రాజ్ తరుణ్ ని కూడా సంప్రదిస్తున్నారట.. రాజ్ తరుణ్ కి రెండు సినిమాలు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్నాయి …మరి దాని ప్రకారం ఆయన ఆ సినిమా చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.