కమెడియన్ రచ్చ రవి గురించి షాకింగ్ విషయం చెప్పిన నాగబాబు

కమెడియన్ రచ్చ రవి గురించి షాకింగ్ విషయం చెప్పిన నాగబాబు

0
96

నాగబాబు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో మానేసి హాయిగా మరో ఛానెల్లో షో చేసుకుంటున్నాడు. కొత్త జడ్జి కోసం మల్లెమాల వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల తన ఛానల్ లో జబర్దస్త్ వెనక నిజాలు అంటూ మరో షో కూడా మొదలుపెట్టాడు. తాను ఎందుకు బయటకు వచ్చానో నిజాలు చెబుతున్నారు.

అంతేకాదు గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్పారు.టీమ్ లీడర్ రచ్చ రవి మనకు తెలుసుకుదా, తనదైన శైలిలో అందరిని నవ్విస్తూ ఉంటాడు..చమ్మక్ చంద్ర టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత సొంతంగా బయటికి వచ్చి టీం లీడర్ కూడా అయ్యాడు రవి

గతంలో ఇలా జబర్దస్త్ షో చేస్తున్నపుడే రచ్చ రవికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు రవికి గాయాలు తీవ్రంగా అయ్యాయి, ఈ సమయంలో నాగబాబు అపోలోకి వెళ్లి మెరుగైన చికిత్స అందిచాలి అని చెప్పారు. అంతేకాదు జబర్దస్త్ సభ్యులు అందరూ కలిసి ఆస్పత్రి వైద్యానికి సాయంకూడా చేశారు. దీంతో నాగబాబు ఓ ఆలోచనకు వచ్చారట.

రవి యాక్సిడెంట్ తర్వాతే జబర్దస్త్ కమెడియన్స్ కోసం ప్రత్యేకంగా ఓ సహాయనిధి ఏర్పాటు చేసాడు నాగబాబు. ప్రతీ నెల కొంత మొత్తం అందులో జమ చేస్తారు…మొత్తానికే అదే ఇప్పుడు చాలా మందికి సాయం చేస్తోందట.. మొత్తానికి నాగబాబు ఇలా చేసి మంచి పని చేశారు అంటున్నారు అభిమానులు.