ఏపీ టాప్ శాటిలైట్ మీడియాలో యాంకర్ కు వార్నింగ్

ఏపీ టాప్ శాటిలైట్ మీడియాలో యాంకర్ కు వార్నింగ్

0
106

రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం కామన్, అయితే దాడులకు దిగడం మాత్రం రాజకీయాల్లో హర్షించేది కాదు, కాని పార్టీ తరపున కొందరు నేతలు దూకుడు స్వభావం కలిగిన వారు అలాంటి దూకుడు చ ర్యలకు పాల్పడినా వారిని సముదాయిస్తారు ..ఆవేశం కట్టలు తెంచుకుంటే ఇక అది మరింత దారుణంగా మారుతుంది.. ఇటీవల మీడియాలలో ఇలాంటి ఆవేశ పూరిత చర్చలు మనకు కనిపిస్తున్నాయి.

అయితే ఇలా మీడియా ఛానల్స్ కొన్ని పుల్లలు పెట్టే విధంగా మారుతున్నాయి అని విమర్శలు వస్తున్నాయి.. అయితే ఎడిటోరియల్ టీం ఎంత మేరకు వీటిని నిలుపుదల చేస్తుంది అంటే లైవ్ సమావేశాల్లో ఆగ్రహాలు ఏ మేరకు వెళతాయో తెలియదు.

అయితే ఓ చానల్ గురించి ఇలాంటి డిబేట్ విషయంలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.. దీంతో ఇలా సమావేశాలు డిబేట్లు పెట్టిన సమయంలో నాయకుల తీరు మరీ దారుణంగా ఆవేశపూరితంగా వస్తే, డిస్కషన్ ఆపేయాలని, లేదా దానిని సర్దిచెప్పాలని, తిట్ల దండకాలు ఛానల్ మీదుగా బయటకు వెళ్లకూడదు అని సదరు యాంకర్ కు వార్నింగ్ ఇచ్చిందట యాజమాన్యం.