రాము రవి ఇద్దరు మంచి స్నేహితులు.. రాముకి స్నేహ అనే అమ్మాయితో పెళ్లి అయింది. రాము సిటీలో ఓ ఏరియాలో కాపురం పెట్టాడు. అయితే తరచూ వీరి ఇంటికి రవి కూడా వస్తూ ఉండేవాడు.. ఈ సమయంలో స్నేహతో కూడా బాగా చనువు పెరిగింది. అయితే వీరిద్దరూ అప్పుడప్పుడూ ఫోన్ చాటింగ్ చేసుకునేవారు.
చాలా సార్లు రాము కూడా చూశాడు, కాని దీనిపై ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. అయితే ఓరోజు రాము పనిమీద బయటకు వెళ్లాడు.. ఈ సమయంలో రవి , రాము ఇంటికి 11 గంటలకు వచ్చాడు.. ఇంటిలోనే ఉన్నాడు, రాము అనుకోకుండా 2 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో ఇంట్లో స్నేహ రవి ఇద్దరూ ఉన్నారు.
దీంతో వాడు ఇంటికి వచ్చి ఎంత సేపు అయింది నాకు ఎందుకు చెప్పలేదు అంటూ భార్యని తిట్టాడు రాము…తర్వాత రవి నేను మాములుగా వచ్చా నువ్వు అనుకున్నట్లు అఫైర్ లేదు అన్నాడు. ఈ సమయంలో రాముకి కోపం వచ్చింది, వెంటనే రాము పక్కన ఉన్న చాకుతో రవి మెడ కోశాడు… రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు, అయితే పోలీసుల విచారణలో వారికి అఫైర్ లేదు అని తేలింది. రాము జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.