మెగాస్టార్ చిరంజీవిలా టాలీవుడ్ లో ఎవరూ డ్యాన్స్ చేయలేరు.. ఇది అందరూ ఒప్పుకునేదే.. అరవై దాటినా ఆయన అడుగులు స్టేజ్ పై పదనిసలు చేస్తాయి. ఆయన డ్యాన్స్ అంటే కోట్లాది మందికి ఇష్టం, తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన పాత సినిమా రోజులకి వెళ్లిపోయారు.. అవును ఇటీవల క్లాస్ ఆఫ్ ఎయిటీస్ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి.
అది ఈసారి మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిలో నిర్వహించారు. అయితే దానికి సంబంధించిన ఫోటోలు వచ్చాయి. వాటిలో అక్కడకు వచ్చిన అలనాటి అందాల భామలు హీరోల గురించి ఫోటోలు వచ్చాయి, తాజాగా చిరు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో చిరు డ్యాన్స్ చించేశారు.
బంగారు కోడిపెట్ట సాంగ్‌కు ఆయన ఖుష్భూతో డ్యాన్స్ చేశారు. మధ్యలో జయప్రద కూడా చిరుతో జత కలిశారు. చిరు స్టెప్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. మా చిరు అదరగొట్టాడు అంటున్నారు, మరి చిరంజీవా మజాకానా.